సూర్యాపేట జిల్లాకు శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ జ‌లాలు విడుద‌ల‌

by Ratna Kumari |

ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ రోజుల గడువు గడిచినప్పటికీ కూడా శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ రెండవ దశ నీళ్లు ఎప్పుడొస్తాయో..? అంటూ ఎదురుచూస్తున్న సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీటిపారుదల శాఖ బుధవారం సాయంత్రం చల్లని కబురు అందించారు.

సూర్యాపేట జిల్లాకు శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ జ‌లాలు విడుద‌ల‌
X

దిశ, తుంగతుర్తి : ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ రోజుల గడువు గడిచినప్పటికీ కూడా శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ రెండవ దశ నీళ్లు ఎప్పుడొస్తాయో..? అంటూ ఎదురుచూస్తున్న సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీటిపారుదల శాఖ బుధవారం సాయంత్రం చల్లని కబురు అందించారు. ఈ మేరకు జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద సాయంత్రం ఐదు గంటలకు గేట్లు ఎత్తి వారబండీ పద్ధతిన ఐదవ విడతగా నీళ్లను విడుదల చేశారు. తొలుత 1200 క్యూసెక్కుల నీటిని వదలగా తుంగతుర్తి నియోజకవర్గంలోని, తిరుమలగిరి మండలం వెలిశాల ప్రాంతం వద్ద సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ మేరకు 69,70,71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలోని పలు ప్రాంతాల వైపు నీళ్లు కదులుతున్నాయి. నీటి సామర్ధ్యాన్ని గురువారం రోజుకు 1700 క్యూసెక్కులకు పెంచనున్నారు.

రిజర్వాయర్ సమాచారం

0.480 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 0.437 లు మాత్రమే ఉన్నట్లు నీటిపారుదల శాఖ తిరుమలగిరి డివిజన్ 2 ఈఈ ఎం.సత్యనారాయణ, రిజర్వాయర్ ఏఈఈ చంద్రశేఖర్ లు తెలిపారు. రిజర్వాయర్ లోకి పైనుండి (అంటే వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం ప్రాంతం వద్ద ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) 650 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరుతుండగా సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి 1200 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు వారు వివరించారు. వాస్తవానికి ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 8న ఐదో విడతగా వారబందీ పద్ధతిలో సూర్యాపేట జిల్లాకు నీళ్లు రావాల్సి ఉంది.అది కాస్త 9వ తేదీకి వాయిదా పడింది.ఈ తరుణంలో శ్రీరాంసాగర్ మొదటి దశ ఎగువ బాగాన కాలువలో ఇద్దరు పడి మృత్యువాత పడ్డ సంఘటన కూడా జరిగింది.దీంతో మొదటి,రెండో దశ కాలువలకు నీటి సరఫరా నిలిచిపోయింది.దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాకు వారబంది షెడ్యూల్ ప్రకారం.. వారం రోజులపాటు నిలిచిపోవడం, అనంతరం ఈ నెల 8 నుంచి రావాల్సిన నీళ్లు రాకపోవడంలాంటి పరిణామాలతో రైతు గుండె మండింది.నీళ్లు ఎప్పుడు విడుదల చేస్తారంటూ..? సంబంధిత శాఖ అధికారులతో పాటు పలువురికి రైతులనుండి పెద్ద మొత్తంలో ఫోన్లు వెళ్లాయి.ఒక దశలో రైతుల ఫోన్ల తాకిడి తట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రైతులు మంగళవారం నాగారం మండలంలో సూర్యాపేట~జనగాం జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేపట్టి నిరసనలు తెలియజేశారు.

Next Story