- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఆర్సీబీ కప్ గెలిచిన క్షణాలు.. బట్టలు విప్పి మరీ అభిమానుల సెలబ్రేషన్స్
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కప్పు గెలవడంతో సూర్యాపేట జిల్లాలోని ఆర్సీబీ అభిమానులు బట్టలిప్పి డాన్స్ వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దిశ, సూర్యాపేట: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కప్పు గెలవడంతో సూర్యాపేట జిల్లాలోని ఆర్సీబీ అభిమానులు బట్టలిప్పి డాన్స్ వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు . ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్, ఆర్సీబీ పోటాపోటీగా ఆడగా.. గెలుపు ఆర్సీబీని వరించింది. దీంతో జిల్లాలోని కోహ్లీ ఫాన్స్ బట్టలిప్పి మరి డాన్సులు వేస్తూ.. సూర్యాపేట పట్టణంలోని పలు కేంద్రాల్లో ఆనందం పంచుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని బార్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ల ముందు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్ లో బాంబులు కాలుస్తూ, ద్విచక్ర వాహనాలపై పట్టణమంతా తిరుగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.






