రేషన్ బియ్యం పట్టివేత

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-17 14:58:08  IST  )

కన్నారెడ్డి కుంట తండాలో అక్రమంగా నిలువ - 10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

రేషన్ బియ్యం పట్టివేత
X

రేషన్ బియ్యం పట్టివేత

- కన్నారెడ్డి కుంట తండాలో అక్రమంగా నిలువ

- 10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

దిశ,తిరుమలగిరి: తిరుమలగిరి మండల పరిధిలోని కన్నారెడ్డి కుంట తండాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడింది. నమ్మదగిన సమాచారం మేరకు తిరుమలగిరి మండల రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి బుధవారం సాయంత్రం లకావత్ వెంకన్న తండ్రి రాములు ఇంటిపై దాడి నిర్వహించగా ఈ తనిఖీల్లో 27 బస్తాలు, సుమారు 10క్వింటాళ్ల 80కిలోల రేషన్ బియ్యం బయటపడింది. రెవెన్యూ అధికారులు బియ్యం బస్తాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చర్యతో అక్రమ రేషన్ బియ్యం నిల్వదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ తనిఖీల్లో ఎస్ఐ తో పాటు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సుజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story