దిశ ఎఫెక్ట్: రేషన్ బియ్యం తూకంలో చేతివాటం.. స్పందించిన అధికారులు

by Bhanu |

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని మున్సిపాలిటీలో విలీనమైన దూరజ్‌పల్లి రేషన్ షాపులో మూడు నెలలుగా బియ్యం పంపిణీలో తేడాలు ఉన్నాయని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

దిశ ఎఫెక్ట్: రేషన్ బియ్యం తూకంలో చేతివాటం.. స్పందించిన అధికారులు
X

దిశ, చివ్వేంల: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని మున్సిపాలిటీలో విలీనమైన దూరజ్‌పల్లి రేషన్ షాపులో మూడు నెలలుగా బియ్యం పంపిణీలో తేడాలు ఉన్నాయని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా చొప్పున రెండు కేజీల బియ్యం తక్కువగా ఇచ్చినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు “రేషన్ బియ్యం తూకంలో చేతివాటం.. మూడు నెలలు.. రెండు కిలోలు కోత” అనే శీర్షికతో దిశ పత్రికలో గురువారం కథనం ప్రచురితమైంది. దిశ కథనానికి స్పందించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం వెంటనే దూరజ్‌పల్లి వార్డులోని సంబంధిత రేషన్ దుకాణాన్ని సందర్శించి స్టాక్ వివరాలను పరిశీలించింది. స్థానికులను సంప్రదించి, గత మూడు నెలలుగా బియ్యం పంపిణీపై పూర్తి సమాచారం సేకరించింది.

ఈ తనిఖీల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందంతో పాటు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Next Story