- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతదేహంతో టోల్ ప్లాజా వద్ద రాస్తారోకో
దిశ, మాడుగుల పల్లి : మాడుగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శనివారం బొలెరో పల్సర్ బైకు ఢీ కొని మాడ్గులపల్లికి

దిశ, మాడుగుల పల్లి : మాడుగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శనివారం బొలెరో పల్సర్ బైకు ఢీ కొని మాడ్గులపల్లికి చెందిన యువకుడు కొండ నాగరాజు(35)అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. మాడులపల్లిలో టెంట్ హౌస్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. యువకుడు మృతి గల కారణం సర్వీస్ రోడ్ లేకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు పెరిగాయని మాడ్గులపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్దకు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు వలన చనిపోతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి తమకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. స్థానిక ఎస్సై కృష్ణయ్య, వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో అక్కడి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. ఈ ట్రాఫిక్ లో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ చిక్కుకు పోయారు. నిరసన కార్యక్రమంలో మాడుగుల పల్లి సర్పంచ్ ఆరూరి నరేష్, ఉప సర్పంచ్ మల్లెపల్లి ఎంకన్న, సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునుగోటి యాదగిరి, నాయకులు పుల్లెంల నరసింహ, పుల్లెంల ఏడుకొండలు, శ్రీకర్, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.






