ప్రశ్నిస్తే అక్రమ కేసులా... మీ తాటాకు చప్పుళ్లకు ప్రజాస్వామ్యం బెదరదు

by Dishanational1 |
ప్రశ్నిస్తే అక్రమ కేసులా... మీ తాటాకు చప్పుళ్లకు ప్రజాస్వామ్యం బెదరదు
X

దిశ, పెన్ పహాడ్: పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటించడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శనివారం హాత్ సే హాత్ జోడో మహా పాదయాత్రలో భాగంగా మండలంలోని గాజులమల్కాపురం, తంగేళ్ల గూడెం, చీదేళ్ల, గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి ఆయన మాట్లాడుతూ మోడీ, అమీత్ షాల నియంతృత్వ పోకడలు, మన దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టు వేస్తూన్నాయి అన్నారు. ప్రజా వ్యతిరేక బీజేపీ పాలనను వ్యతిరేకించి దేశంలో ఇందిరమ్మ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటన చేసి తిరుగులేని ప్రజా నాయకుడిగా అవతరించడం చూసి బీజేపీ శక్తులకు భయం పట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరావు, బెల్లంకొండ శ్రీరాములు, కుందురు వెంకటరెడ్డి, యడ్ల వెంకటరెడ్డి, రణబోతు శ్రీనివాస్ రెడ్డి, లింగయ్య, జూలకంటి సుధాకర్ రెడ్డి, జాన్ రెడ్డి, నర్సిరెడ్డి, కానుగు శేఖర్, పందుల వెంకటేశ్వర్లు, గుణగంటి ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, కందుల సైదులు, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed