- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో గృహిణి మృతి
by Bhanu |
విద్యుత్ షాక్ తో గృహిణి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని కురుమవాడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, రామన్నపేట : విద్యుత్ షాక్ తో గృహిణి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని కురుమవాడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. కురుమ వాడకు చెందిన జూకంటి అనిత (30) రోజు మాదిరిగానే గురువారం ఉదయం తన ఇంట్లో ఉన్న నీటి సంపుకు ఉన్న విద్యుత్ మోటార్ ను ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమెకు ఆరు సంవత్సరాలోపు, రెండు సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆమె భర్త జూకంటి మహేష్ వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ పి మల్లయ్య తెలిపారు.
Next Story






