ఘనంగా రంజాన్ వేడుకలు

by Naveena |

రంజాన్‌ పండగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు.

ఘనంగా రంజాన్ వేడుకలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రంజాన్‌ పండగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గతించిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story