రాజేష్ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కోదాడ : పోలీసుల కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కల రాజేష్ కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్ బక్కి

రాజేష్ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండ
X

దిశ‌, కోదాడ : పోలీసుల కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కల రాజేష్ కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాజేష్ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెనుకడుగు వేయదని తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫున తక్షణ సాయంగా రూ.4 లక్షల 12 వేల విలువైన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఒంటరిగా వదలదని, అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాజేష్ తల్లి కర్ల లలితమ్మ తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడి మరణం జరిగిన తీరును కళ్లలో నీళ్లతో వివరించగా.. ఆ దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆమె వేడుకున్నారు.

ఇలాంటి అమానుష ఘటన స్వాతంత్య్రం వ‌చ్చి 70 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీలపై కూడా దాడులు జరగడం అత్యంత అమానుషమని బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి తలవంచుకునే పరిస్థితి తెస్తాయని అన్నారు. కర్ల లలితమ్మ పరిస్థితిని చూస్తే హృదయం కలిచివేస్తోందని, ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కమిషన్అం డగాఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి న్యాయం వరకు పోరాటం రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పూర్తిగా అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రకాల సహాయాలు ఇప్పిస్తామని బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఈ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, కర్ల సుందర్ బాబు, గుండెపంగు రమేష్, గంధం పాండు, ఎమ్మార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story