- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామస్తుల సహకారంతో.. ఇల్లు నిర్మించి ఇచ్చిన యువకులు
రాజపేటకు చెందిన పేదింటి మహిళకు ఇల్లు లేక బాత్రూంలోనే నివాసం ఉండడంతో గమనించిన స్థానిక ఎస్సీ కాలనీవాసులు ఇల్లు కట్టించి ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు.

దిశ, రాజపేట: రాజపేటకు చెందిన పేదింటి మహిళకు ఇల్లు లేక బాత్రూంలోనే నివాసం ఉండడంతో గమనించిన స్థానిక ఎస్సీ కాలనీవాసులు ఇల్లు కట్టించి ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు. వివరెవరికి వెళ్తే.. రాజపేట ఎస్సి కాలానికి చెందిన సిరిపంగ బాలనర్సమ్మకి ఉండడానికి ఇల్లు లేదు. ఆర్థిక స్తోమత లేక బాత్రూంలోనే కొన్నేళ్లుగా వాసముంటున్నది. అది చూసి చలించిన కాలనీవాసులు, యువకులు ఇల్లు కోసం వారు తల కొంత వేసి మొత్తం 315000 కావాల్సి ఉండగా గ్రామస్తుల ద్వారా సేకరించి ఇంటి నిర్మాణం చేపట్టారు. కొందరు దాతలు డబ్బులు, కొందరు దాతలు ఇంటి నిర్మాణ వస్తువులను బహుకరించినట్లు కాలనీవాసులు తెలిపారు. పేదింటి అవ్వ కళ్ళల్లో ఆనందం చూడడంతో మా కష్టమంతా కనుమరుగైనదని యువకులు ఆనందం వ్యక్తం చేశారు. కన్నవారే తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేస్తున్న ప్రస్తుత సమాజంలో కాలనీవాసుల తీరు ప్రశంసనీయమని పలువురు అభినందిస్తున్నారు.






