- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. విధుల్లో చేరిన రేడియోగ్రాఫర్..
తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో చివరికి రేడియోగ్రాఫర్ పోస్టు భర్తీ అయింది. గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని పత్రికా కథనం వెంటనే అధికారులు పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టారు.

దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో చివరికి రేడియోగ్రాఫర్ పోస్టు భర్తీ అయింది. గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని పత్రికా కథనం వెంటనే అధికారులు పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టారు. "ఎక్స్‌రే కోసం 40 కిలోమీటర్లు ప్రయాణం తప్పదు" అనే శీర్షికతో ఈనెల 20న దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల స్పందన లభించింది.
తెలంగాణ మెడికల్ అండ్ ఇన్‌ఫార్చ్యూన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC) అధికారులు, సూర్యాపేట జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారి వెంకటేశ్వర్లు స్పందించగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ తో సంప్రదించి ఎక్స్‌రే యంత్రం పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఎక్స్‌రే యంత్రం పాతదే అయినప్పటికీ, త్వరలోనే ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎక్స్‌రే మిషన్ పంపిస్తామని వారు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, కోదాడలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్ వెలుగు కరుణాకర్‌ను తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి ఇన్చార్జీగా నియమించారు. బుధవారం డాక్టర్ నిర్మల్ కుమార్ తనిఖీలు చేపట్టి ఎక్స్‌రే యంత్రం పనితీరును పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యసౌకర్యాలు అందించడంలో ఇది కీలకదశగా భావిస్తున్నారు.






