నేరేడుగొమ్ము మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులుగా పులికంటి సుధాక‌ర్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-07 15:29:44  IST  )

నేరేడుగొమ్ము మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులుగా పులికంటి సుధాక‌ర్ బుధ‌వారం ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. మండ‌ల ఫోరం నూతన క‌మిటీ ఉపాధ్య‌క్షులుగా కేతావ‌త్ బాబురాం ఎన్నిక‌య్యారు.

నేరేడుగొమ్ము మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులుగా పులికంటి సుధాక‌ర్
X

దిశ‌, నేరేడుగొమ్ము : నేరేడుగొమ్ము మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులుగా పులికంటి సుధాక‌ర్ బుధ‌వారం ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. మండ‌ల ఫోరం నూతన క‌మిటీ ఉపాధ్య‌క్షులుగా కేతావ‌త్ బాబురాం, కోశాధికారి గా బాణావత్ మంజునాథ్ ఎన్నిక‌య్యారు. నేరేడుగొమ్ము మండ‌ల కేంద్రంలోని రైతువేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మండ‌లంలోని అన్ని గ్రామాల స‌ర్పంచ్ లు హాజ‌ర‌య్యారు. బ‌చ్చాపూర్ స‌ర్పంచ్ బాబురామ్, బుగ్గ‌తండా స‌ర్పంచ్ సుజాత‌, చిన్న మునిగ‌ల్ స‌ర్పంచ్ వెంక‌టేశ్వ‌ర్లు, దాస‌ర్ల‌ప‌ల్లి స‌ర్పంచ్ శివ‌కుమార్, ధ‌ర్మారేఖ్య‌తండా కే.శ్రీను, గుర్ర‌పు తండా ల‌క్ష్మీ, జోడుబాయి తండా మంజునాథ్, కాస‌రాజుప‌ల్లి బాబురామ్, కేతెప‌ల్లి స‌ర్పంచ్ ప‌ద్మ‌, కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ ద‌స్రు, మోసంగ‌డ్డ తండా ర‌వి, ప‌డ‌మ‌టితండా బాలు, పందిరిగుండు తండా స‌ర్పంచ్ శ్రీను, సుద్ద‌బాయి తండా వి.ల‌క్ష్మీలు నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. నేరేడుగొమ్ము స‌ర్పంచ్ సుధాక‌ర్ మాట్లాడుతూ స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులుగా ఎన్నుకున్నందుకు ప్ర‌తీ గ్రామ స‌ర్పంచ్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ్రామ ప్ర‌జ‌ల‌కు, మండ‌ల స‌ర్పంచ్ ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండి వారి స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపుతూ త‌మ గ్రామాల‌ను ఎమ్మెల్యే బాలునాయ‌క్ స‌హ‌కారంతో ప్ర‌తీ గ్రామాన్ని ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షులు లోక‌సాని కృష్ణ‌య్య‌, మాజీ ఎంపీటీసీ గిరి యాద‌య్య‌, గ‌డ్డం వెంక‌ట‌య్య‌, నాయ‌కులు ముక్క‌మ‌ల్ల శ్రీను పాల్గొన్నారు.

Next Story