- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్ వెంకట్రావ్
ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ యస్.వెంకట్రావ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

దిశ, సూర్యా పేట ప్రతినిధి: ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ యస్.వెంకట్రావ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్. మోహన్ రావులతో కలసి పాల్గొని అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వెబెక్స్ ద్వారా ఆయా రెవెన్యూ డివిజన్ల వారిగా ఆర్డీవోలు, సంబంధిత తహసీల్దార్లతో అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకొని సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని మండలాల ఎంపీడీవోలు తహసీల్దార్ల కార్యాలయా్ల్లో ప్రజావాణి కార్యక్రమంలోపాల్గొని వెబెక్స్ ద్వారా ప్రజా సమస్యలపై సమాధానమివ్వాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యల దరఖాస్తులు 33, డీ.ఆర్.డీ.ఏ 18, ఇతర శాఖల దరఖాస్తులు10 అందాయని దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
త్వరలో అమల్లోకి ఈ-ఆఫీస్ విధానం..
జిల్లా కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు కలెక్టర్ యస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ-ఆఫీస్ విధివిధానాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్.మోహన్ రావుతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందు కోసం అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్, డీఎఫ్ వో సతీష్, పీడీ కిరణ్ కుమార్, సీపీవో వెంకటేశ్వర్లు, డీఈవో అశోక్, డీఈ వో రామారావు నాయక్, డీహెచ్ వో శ్రీధర్ గౌడ్, పి.డి. ఐ సి డి ఎస్ జ్యోతి పద్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






