- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో బహిరంగ వేలం పాట
నల్లగొండ జిల్లా, కనగల్లు మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక యల్లమ్మ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు.

దిశ, కనగల్లు : నల్లగొండ జిల్లా, కనగల్లు మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక యల్లమ్మ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయం ప్రసిద్ధిచెందింది. కాగా, ఆలయ పరిధిలో పూజవస్తువులు అమ్ముకొనుటకు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.మహేంద్ర కుమార్, ఆలయ చైర్మన్ అలుగుబెల్లి నరసింహారెడ్డి పర్యవేక్షణలో ఈ వేలం పాటలు జరిగాయి. టెండర్లలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు భారీగా తరలివచ్చారు.
లడ్డు, పులిహోర, అమ్ముకొనుటకు ఈశ్వర్ రూ.11.60 లక్షలు, గాజులు అమ్ముకొనుటకు అనంతరం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు రూ.9.55 లక్షలు, బొమ్మలు, కిరాణం అమ్ముకొనుటకు ఎం.కళ్యాణి రూ.1.25 లక్షలు బహిరంగ వేలంలో టెండర్లు దక్కించుకున్నారు. మిగతా వేలం పాటలకు సరైన వేలం రానందున తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జిల్లపల్లి జయరామయ్య, ఇన్స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి, మాజీ చైర్మన్ లు కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, దేప కరుణాకర్ రెడ్డి, యాదగిరి, ఎంపీటీసీ నకిరేకంటి శైలజ సైదులు గౌడ్, దేవాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ జినుకుంట్ల చంద్రయ్య, సిహెచ్ .లింగయ్య, జూనియర్ అసిస్టెంట్ చెనగోని లింగస్వామి, కుసం ఉపేందర్ రెడ్డి, నకిరేకంటి ఆంజనేయులు, జినుకుంట్ల నాగరాజు, చెనగోని శ్రీకర్, వెంకటయ్య ఆలయ ధర్మకర్తలు జినుకుంట్ల శ్రీశైలం గౌడ్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.






