- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచిన వంట గ్యాస్ ధర తగ్గించాలని నిరసన : సీపీఎం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా పెంచిన గృహ వినియోగదారుల గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా పెంచిన గృహ వినియోగదారుల గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆ పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గోశిక కరుణాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారంగా మారిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరలను పెంచడం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.
దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుతూ పేద ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలనిడిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి. పాషా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి. ఖయ్యూం, కందగట్ల ఆనంద్, తూర్పునూరి మల్లేశం, బోయ యాదయ్య, కల్వకుంట్ల శివ, దాసరి ప్రకాష్, వడ్లపల్లి స్వామి, బత్తుల నవీన్, యాదయ్య, రాజు, ఎండి. హర్ష బేగం పాల్గొన్నారు.






