బాలిక‌ల ర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త : ఎంపీడీఓ జి. జ‌య‌రాం విజ‌య్

by Ratna Kumari |

బాలిక‌ల ర‌క్ష‌ణ‌, అభివృద్ధి, విద్య ప్ర‌తి ఒక్క‌రి సామాజిక బాధ్య‌త అని ఎంపీడీఓ జి.జ‌య‌రాం విజ‌య్ పేర్కొన్నారు.

బాలిక‌ల ర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త : ఎంపీడీఓ జి. జ‌య‌రాం విజ‌య్
X

దిశ‌, నేరేడుగొమ్ము : బాలిక‌ల ర‌క్ష‌ణ‌, అభివృద్ధి, విద్య ప్ర‌తి ఒక్క‌రి సామాజిక బాధ్య‌త అని ఎంపీడీఓ జి.జ‌య‌రాం విజ‌య్ పేర్కొన్నారు. నేరేడుగొమ్ము ఎంపీడీఓ ఆధ్వ‌ర్యంలో బేటీ బ‌చావో బేటీ ప‌డావో కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బాల్య వివాహాలు, గ‌ర్భ‌స్థ శిశు హ‌త్య‌లు, లైంగిక వేధింపులు, ఆడ‌పిల్ల‌ల విద్యాభివృద్ధి, సామాజిక దురాచారాలు, సామాజిక మాద్య‌మాల దుష్ప్ర‌భావం, సైబ‌ర్ నేరాల వంటి అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం త‌హ‌శీల్దార్ ఉమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహాల నియంత్ర‌ణ‌లో రెవెన్యూ శాఖ కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. గ్రామ‌స్థాయిలో అనుమాన‌స్ప‌ద సంఘ‌ట‌న‌లు గ‌మ‌నించిన వెంట‌నే స‌మాచారం అందించాల‌ని సూచించారు.

ఐసీడీఎస్ సీడీపీఓ చంద్ర‌క‌ళ మాట్లాడుతూ అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా బాలిక‌ల ఆరోగ్యం, పోష‌ణ‌, విద్య పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ప్ర‌తి గ్రామంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి బాలిక‌ల హ‌క్కుల‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. అధికారుల స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తేనే బేటీ బ‌చావో బేటీ ప‌డావో ల‌క్ష్యాలు నెర‌వేరుతాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. పోలీసుల‌తో క‌లిసి సైబ‌ర్ నేరాలు, లైంగిక వేధింపుల‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఈఓ బ్ర‌హ్మ‌చారి, మెడిక‌ల్ ఆఫీస‌ర్ డా.రాజేష్, పోలీస్ అధికారులు, ఎన్జీవో ప్ర‌తినిధులు, అంగ‌న్ వాడీ సూప‌ర్ వైజ‌ర్లు, అంగ‌న్ వాడీ టీచ‌ర్లు పాల్గొన్నారు.

Next Story