నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని వినోబాభావే మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలలో 104 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని, దీనికి సంబంధించి 224 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోచంపల్లి మున్సిపల్ వ్యాప్తంగా 13 వార్డులకు నలుగురు రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి అంజన్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, మజీద్, దామోదర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, ఆదిత్య, మైథిలి పాల్గొన్నారు.

Next Story