- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు సొంత ఖర్చులతో బహుమతులు
చందంపేట మండల పరిధిలోని పోలేపల్లి క్రాస్ రోడ్, బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ మెయిన్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ యజమాని మిరియాల అశోక్ వినూత్న ఆలోచనతో వాహనదారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

దిశ, చందంపేట : చందంపేట మండల పరిధిలోని పోలేపల్లి క్రాస్ రోడ్, బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ మెయిన్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ యజమాని మిరియాల అశోక్ వినూత్న ఆలోచనతో వాహనదారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్రోల్ బంక్‌లో ప్రతి వారం టూ వీలర్ వాహనదారులు రూ.200కు పైగా, ఫోర్ వీలర్ వాహనదారులు రూ.300కు పైగా పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుంటే వారికి టోకెన్లు అందజేస్తున్నారు. ఆ టోకెన్ల ఆధారంగా ప్రతి గురువారం డ్రా నిర్వహించి, గెలుపొందిన వాహనదారులకు సొంత ఖర్చులతో బహుమతులు అందజేస్తున్నారు. ఈ లక్కీ డ్రాను స్వయంగా మిరియాల అశోక్ నిర్వహించి.. విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందజేసి బహుమతులు అందించడం విశేషం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
పేద విద్యార్థులకు వరంగా అశోకా సేవా ట్రస్ట్
పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అశోకా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ మిరియాల అశోక్ దిశ తో తెలిపారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు బెంచీలు, కుర్చీలు అందించడం ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన విద్యా సామగ్రి, మౌలిక వసతులు ట్రస్ట్ ద్వారా సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు అశోకా సేవా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యాభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.






