- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
చందంపేట మండల పరిధిలోని తెల్దేవర్ పల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి పీసీసీ, పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు.

దిశ, చందంపేట : చందంపేట మండలంలోని పాత తెల్దేవరపల్లి గ్రామంలో సర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి తెల్దేవర్ పల్లి గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పీసీసీ, & PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి మాట్లాడారు. తెల్దేవరపల్లి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి ఇవి కండరాల బలం గుండె ఆరోగ్యం మెరుగైన రక్త ప్రసరణను అందిస్తూ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బృంద కృషితో కూడిన ఆటలు యువకుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ జట్టుగా పని చేసే నైపుణ్యాన్ని (Team Work) అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, గ్రామ సర్పంచ్ లు దండు చంద్రమ్మ సాలయ్య, N రాములు నాయక్, హనుమ నాయక్, ఉప సర్పంచ్ లు రాజు, రేణుకా మాతృ నాయక్, చవ్వ నారాయణ, లింగయ్య, లక్ష్మయ్య, చవ్వ ఆంజనేయులు, కనకయ్య, ఆర్గనైజర్స్ శశి, అర్జున్, అనిల్, సందీప్, ప్రశాంత్ పాల్గొన్నారు.






