మర్రిగూడలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం

by Kodari Anjali |

మర్రిగూడలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం అవ్వనుందని మండల విద్యాధికారిణి జి. శారద తెలిపారు.

మర్రిగూడలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం
X

దిశ, మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ప్రీ-ప్రైమరీ విద్య అందించేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి మర్రిగూడ మండలంలోని నాలుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు మండల విద్యాధికారిణి జి. శారద తెలిపారు. దామెర భీమనపల్లి, కుదభక్ష పల్లి, తిరుగండ్లపల్లి, యరగండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలు ఇందుకు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ప్రవేశాలు కల్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుదలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.

Next Story