- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం- సూర్యపేట జాతీయ రహదారి 365బీబీ పై పోలీసుల ఆంక్షలు
సంక్రాంతి పండుగ ప్రయాణాల కారణంగా వాహనాల రద్దీని నియంత్రించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి 365బీబీ పై పోలీస్ ఆంక్షలు ఉన్నాయని ఎస్సై మహేష్ తెలిపారు.

దిశ, చివ్వెంల : సంక్రాంతి పండుగ ప్రయాణాల కారణంగా వాహనాల రద్దీని నియంత్రించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి 365బీబీ పై హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను చివ్వెంల మండల పరిధిలో వట్టి ఖమ్మంపహడ్ వద్ద నియంత్రిస్తూ ఆంక్షలు అమలు చేయడం జరుగుతుందనీ ఎస్సై మహేష్ తెలిపారు. టేకుమట్ల వైపు వెళ్లే హైదరాబాద్ వెళ్ళు వాహనాలను ఇక్కడ సర్వీస్ రోడ్డు నుంచి సూర్యాపేట వెళ్లే పాత హైవే మీదుగా చివ్వెంల గ్రామం నుంచి సూర్యాపేటకు మళ్లించడం జరుగుతుందన్నారు. సూర్యాపేట పట్టణంలో ఖమ్మం అండర్ పాస్ నుంచి వెళ్లి హైదరాబాద్ వైపు వెళ్ళవచ్చని వాహనదారులకు తెలియజేశారు. రాయినిగూడెం వద్ద హైదరాబాద్ వైపు యూటర్న్ మూసివేయడం వల్ల ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనదారుల సౌకర్యార్థం ఈ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆయన వెంట జాతీయ రహదారి సిబ్బంది, పోలీసులు ఉన్నారు.






