- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి.. ఆరు ట్రాక్టర్లు పట్టివేత
రాజపేట మండలం రఘునాథపురం గ్రామ పరిధిలో అక్రమంగా వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.

దిశ, రాజాపేట: రాజపేట మండలం రఘునాథపురం గ్రామ పరిధిలో అక్రమంగా వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 29న, మధ్యాహ్నం 3:00 గంటలకు రఘునాథపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి చింతల గణేష్ పోలీసులకు వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో తాను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రఘునాథపురం గ్రామ సమీపంలోని వాగులో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే గణేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పల్లెపాటి నర్సింహులుతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వాగులో ఆరు ట్రాక్టర్లు ఇసుకను నింపుకుంటూ ఉండటం గమనించానని, వెంటనే వాటిని అదుపులోకి తీసుకుని డ్రైవర్లను అనుమతి పత్రాలు చూపించాలని కోరగా, ఎవరూ సరైన అనుమతులు చూపలేకపోయారని తెలిపారు.
పోలీసుల విచారణలో డ్రైవర్లు తమ వివరాలను వెల్లడించిన ప్రకారం అందులో బాల్దె సిద్ధులు, ఎర్ర కార్తీక్, జంగిలి ప్రవీణ్, వడ్లకొండ పరమేష్, గుజరాతి శ్రీరామ్, కొమ్ము మనోజ్ లు అనే ఆరుగురు డ్రైవర్లు ఉన్నట్లు తేలింది. వీరంతా స్వరాజ్ కంపెనీకి చెందిన ట్రాక్టర్లతో అక్రమంగా వాగు ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లు పరమేష్, శ్రీరామ్, మనోజ్ లు తమ ట్రాక్టర్ యజమానులైన మధు, శ్రీకాంత్, ఉమామహేశ్ ఆదేశాల మేరకే ఇసుక రవాణా చేస్తున్నామన్నారు. ఇసుకతో నిండిన ట్రాక్టర్లను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ప్రభుత్వ అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి గణేష్ కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






