పోలుమల్ల గ్రామంలో పోలీసుల కవాతు..!

by Bhanu |   (  Updated:2025-12-06 13:30:38  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు హెచ్చరించారు. ఇప్పటికే పాత నేరస్థులతో పాటు రౌడీ షీటర్లు, ఘర్షణలు సృష్టించే వారిపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

పోలుమల్ల గ్రామంలో పోలీసుల కవాతు..!
X

దిశ,తుంగతుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు హెచ్చరించారు. ఇప్పటికే పాత నేరస్థులతో పాటు రౌడీ షీటర్లు, ఘర్షణలు సృష్టించే వారిపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన పోలుమల్లలో శనివారం సాయంత్రం ఆయన సిబ్బందితో కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఇన్స్పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ.. తుంగతుర్తిలో నూతనకల్, మద్దిరాల మండలాలలో నాలుగు గ్రామాలు చొప్పున అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు మూడు మండలాల్లో 113 మంది రౌడీ షీటర్లుగా ఉన్నారని తెలిపారు. ఇందులో కొంతమంది జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని తిరిగి రప్పిస్తున్నామని తెలిపారు. వీరందరినీ రూ.5 లక్షల పూచీకత్తుపై ఆయా మండలాల తహశీల్దార్‌ల ముందు బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నూతనకల్,మద్దిరాల, తుంగతుర్తి ఎస్సైలు నాగరాజు, వీరన్న, క్రాంతికుమార్‌లు పాల్గొన్నారు.

Next Story