కుంచమర్తిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

by Bhanu |

ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యంగా నాగారం సర్కిల్ పరిధిలో గల గ్రామాలలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కుంచమర్తి గ్రామంలో ఆదివారం పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ఎన్నికల నియమాల పట్ల అవగాహన కల్పించారు. సమస్యలు సృష్టించే వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తేవడం కోసం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కుంచమర్తిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యంగా నాగారం సర్కిల్ పరిధిలో గల గ్రామాలలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కుంచమర్తి గ్రామంలో ఆదివారం పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ఎన్నికల నియమాల పట్ల అవగాహన కల్పించారు. సమస్యలు సృష్టించే వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తేవడం కోసం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని ఎక్కడ కూడా విభేదాలకు వెళ్లి వర్గ తగాదాలు పెట్టుకోవద్దని కోరారు. ఎన్నికలవేళ గొడవలు పడితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు సైదులు, చిరంజీవి, వెంకట్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story