- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన పోచంపల్లి పోలీసులు
పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులని భూదాన్ పోచంపల్లి పోలీసులు మరోసారి నిరూపించారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులని భూదాన్ పోచంపల్లి పోలీసులు మరోసారి నిరూపించారు. వ్యక్తి గత కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతిని టూరిజం పోలీసులు కాపాడి మానవత్వం చాటుకున్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన గోరుగంటి ఉష తన వ్యక్తిగత కారణాలతో పోచంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరు గాంచిన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు టూరిస్ట్ పోలీసులను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చెరువు వైపు వెళ్తున్న ఆ యువతిని టూరిజం పోలీసులు రాజశేఖర్, ప్రవీణ్, భవాని, జాహ్నవి లు గమనించి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుందని అనుమానం రావడంతో యువతిని బయటికి తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోచంపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, యాదగిరి, ఉమెన్ కానిస్టేబుల్ స్వర్ణ, సోని లు ఘటన స్థలానికి చేరుకొని ఆ యువతికి నచ్చ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంటి దగ్గరకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గతంలో పోచంపల్లి పోలీసులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్వయాన తమ భుజాలపై మోసి ప్రాణాలు కాపాడారు. విధి నిర్వహణలో ఉంటూనే, ఆపదలో ఉన్నవారిని కాపాడడంలో చూపిన చొరవను చూసి స్థానికులు "శభాష్ పోలీస్" అంటూ ప్రజలు కొనియాడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పోచంపల్లి పోలీసులు నిదర్శనంగా నిలిచారని, ప్రతి ఒక్కరూ ఇలాగే స్పందించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.






