ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి : ఎస్సై చిరంజీవి

by Ratna Kumari |

దిశ‌, నాగారం : స్థానిక‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని ఎస్సై చిరంజీవి అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని నాగారం

ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి : ఎస్సై చిరంజీవి
X

దిశ‌, నాగారం : స్థానిక‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని ఎస్సై చిరంజీవి అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లాలో అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కండక్ట్ ఆఫ్ ఎన్నికల కోడ్ ను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రచారంలో ప్రత్యర్థి అభ్యర్థులపై ఎటువంటి దుష్ప్రచారాలు చేసిన పిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కానిస్టేబుల్ లు కిరణ్,నాగరాజు,సైదులు తదితరులు ఉన్నారు.

Next Story