పట్ట‌ణాభివృద్ధిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కీల‌కం : మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ

by Ratna Kumari |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '99 రోజుల కార్యాచరణ ప్రణాళిక'లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో శుక్రవారం చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

పట్ట‌ణాభివృద్ధిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కీల‌కం : మున్సిపల్ చైర్ పర్సన్  పున్న శైలజ
X

దిశ, దేవరకొండ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '99 రోజుల కార్యాచరణ ప్రణాళిక'లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో శుక్రవారం చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. డిండి ఎక్స్ రోడ్ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధి, పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు మున్సిపాలిటీ చేపట్టే ప్రత్యేక పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ప‌ట్ట‌ణాభివృద్ధికి మనసా, వాచా, కర్మణా కృషి చేస్తానని అధికారులతో, నాయకులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్ బిజిలి అంకులమ్మ, నాయకులు పున్న వెంకటేశ్వర్లు, నజీర్ అహ్మద్, కౌన్సిలర్ గుండాల అంజయ్య, జానీ, సెవ్యనాయక్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జాగృతి పాల్గొన్నారు. వీరితో పాటు సానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్, ఏఈ రాజు, మేనేజర్ అర్చన, రెవెన్యూ ఆఫీసర్ రాకేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ‌క్రు నాయక్, వార్డు ఆఫీసర్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.

Next Story