MLA Padmavathi : పట్టణ పారిశుద్ధ్యం ప్రజల చేతుల్లోనే...

by Batti.Sumithra |

పారిశుద్ధ్యం కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.

MLA Padmavathi : పట్టణ పారిశుద్ధ్యం ప్రజల చేతుల్లోనే...
X

దిశ, కోదాడ : పారిశుద్ధ్యం కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. పచ్చదనం, పరిశుభ్రతతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టణ పారిశుద్ధ్యం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలు పట్టణ పారిశుద్ధ్యానికి సహకరించాలన్నారు.

కాలుష్య రహిత కోదాడగా మార్చలన్నారు. కాగా వివిధ శాఖల సమన్వయంతో కోదాడ మున్సిపల్ కార్యాలయం నుండి కోదాడ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేశ్, కమిషనర్ రమాదేవి, వైస్ ఛైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్ ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story