- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు సహకరించాలి: మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి
బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు సహకరించాలని మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి అన్నారు.

దిశ, నడిగూడెం: బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు సహకరించాలని మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం నడిగూడ మండల కేంద్రంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహల నిర్మూలలకై గ్రామంలో ప్రధాన రహదారిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఎంపీడీవో మల్సూర్ నాయక్ మాట్లాడుతూ చదువుకునే వయసులో పెళ్లిళ్లు చేయరాదని తల్లిదండ్రులకు సూచించారు. ఎస్సై జి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైద్యాధికారి హరినాథ్ మాట్లాడుతూ.. చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే అనారోగ్యానికి గురయ్య ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాస్, ఎంపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి యలకా ఉమారాణి, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ ఎలుగూరి నాగరాజు,వార్డు సభ్యులు దున్నా లింగయ్య, బాణాల సతీష్ కుమార్, కాసాని మాదవి గోపినాథ్, నాయకులు పందిరి వెంకటరెడ్డి,గుండు శ్రీనివాస్, చిల్లంచర్ల సత్యనారాయణ, గడ్డం మల్లేష్ యాదవ్, బెల్లంకొండ సత్యనారాయణ, గుండు విజయరామారావు, దాసరి శ్రీనివాస్, పల్లపు నాగేశ్వరరావు, కాసాని శివకృష్ణ, కొండా వెంకన్న, షేక్ జలీల్, కత్తి విజయ్, మౌలాన, శ్రీరాముల శ్రీను, యలక సంజీవరెడ్డి, షేక్ జలాలుద్దీన్,లకన్నీబోయిన కిషోర్, ఆర్ఐలు గోపాలరావు, మల్సుర్, జి పి ఓ కోటయ్య, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వాహకురాలు నోసిన లావణ్య,మండల జి పి ఓ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.






