- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా పిల్లలని మాకు ఇవ్వండి మహా ప్రభో.. పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు
మా పిల్లల్ని మాకు ఇప్పించండి మహా ప్రభో అంటూ తల్లిదండ్రులు ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి.

దిశ, సూర్యాపేట : మా పిల్లల్ని మాకు ఇప్పించండి మహా ప్రభో అంటూ తల్లిదండ్రులు ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని పసిగట్టిన పోలీసులు బుధవారం 18 మంది శిశువులను సంరక్షణలోకి తీసుకున్నారు. దీంతో తట్టుకోలేని వారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మా పిల్లల్ని మాకు ఇప్పించండి సార్ అంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ రోడ్డు మీద విలపిస్తూ ధర్నాకు దిగారు.
పిల్లలు లేక తీసుకొచ్చుకున్నాము మా ఆస్తులన్నీ వారికే రాసిస్తాము మా పిల్లల్ని మాకు అప్పగించండి లేకుంటే ఆత్మహత్యలే మాకు శరణ్యం అంటూ పోలీసులను వేడుకున్నారు. దాంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేతపల్లి మండలం కొప్పులు గ్రామానికి చెందిన దంపతులు 25 రోజుల పసిపాపను నాలుగు లక్షలకు తెచ్చుకొని రెండు సంవత్సరాల గా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని మా పాప ను మాకు కావాలని రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మరోవైపు.. సూర్యాపేట మండలం టేకు మట్ల గ్రామానికి చెందిన దంపతులు రెండు నెలల బాలుడిని తీసుకొని మూడు సంవత్సరాల బాబుగా పెంచుకుంటుంటే బుధవారం పోలీసులు ఇంటి వద్దకు వచ్చి తీసుకుపోవడంతో ఆ తల్లి విలపిస్తూ సొమ్మ సిల్లి రోడ్డు మీద పడిపోయింది. ఈ సంఘటన చూసి, పలువురు శిశువులను పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఏడుస్తూ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతుంది.. చూపరులను కంటతడి పెట్టించింది..






