- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లింగయ్యకు నివాళులర్పించిన కూనంనేని
సీపీఐ సీనియర్ నాయకులు కుర్మిద్దె లింగయ్య అనారోగ్యంతో మంగళవారం మృతిచెందగా... paid tributes

దిశ, సంస్థాన్ నారాయణపురం: సీపీఐ సీనియర్ నాయకులు కుర్మిద్దె లింగయ్య అనారోగ్యంతో మంగళవారం మృతిచెందగా ఆయన బౌతిక కాయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... లింగయ్య మరణం సీపీఐ పార్టీకి తీరని లోటు అని అన్నారు. లింగయ్య పార్టీకి అందించిన సేవలు మరువలేని అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1981వ సంవత్సరం నుంచి సీపీఐ పార్టీకి ఆయన సేవలు అందిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, పగిళ్ల యాదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, బచ్చనగోని గాలయ్య, దుబ్బాక భాస్కర్ తదితరులు ఉన్నారు.
- Tags
- Kunamaneni
- cpi






