- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 నెలలుగా జీతాల్లేవ్.. అవస్థలు పడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
4 నెలలుగా జీతాలు రాకపోవడంతో కోదాడ మున్సిపాలిటీలోని 70 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, కోదాడ టౌన్: 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో కోదాడ మున్సిపాలిటీలోని 70 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న కోదాడ మున్సిపాలిటీలో ఈ ఏడాది ఆగస్టులో 70 మంది కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. అయితే అప్పటి నుంచి వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది బడ్జెట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదు. దీంతో వాళ్లకు సకాలంలో శాలరీలు అందడంలేదు. అయితే మున్సిపాలిటీ కౌన్సిల్ తీర్మానం అయ్యాక వాళ్లకు జీతాలు ఇస్తామంటూ చైర్మన్, కౌన్సిలర్లు చెబుతున్నారు. కానీ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య తలెత్తిన విభేదాల వల్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి జీతాలు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.
Next Story






