- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గీత దాటితే వేటే : డీఎస్పీ ప్రసన్న కుమార్
దిశ, తుంగతుర్తి : ఎన్నికల నియమావళి దాటితే వేటే పడుతుందని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ పోటీ అభ్యర్థులను హెచ్చరించారు.ఒక్కో సమయంలో చిన్న పొరపాట్లతో

దిశ, తుంగతుర్తి : ఎన్నికల నియమావళి దాటితే వేటే పడుతుందని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ పోటీ అభ్యర్థులను హెచ్చరించారు.ఒక్కో సమయంలో చిన్న పొరపాట్లతో చివరికి అభ్యర్థిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఘాటుగా స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఎన్నికల నియామావళి,ప్రవర్తనపై పోటీ అభ్యర్థులకు గురువారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.ఎన్నికల కోడ్ అమలయ్యే నాటినుండి అది ముగిసే వరకు కూడా అభ్యర్థులు చేపట్టే కార్యక్రమాలకు అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు.ఈనెల 9 సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రచారం పూర్తి చేయాలని, ఈ క్రమంలో అభ్యర్థులు తీసుకున్న అనుమతులు కూడా రద్దవుతాయని తెలిపారు. ఓటింగ్ కేంద్రాల వద్ద టెంట్ ల ఏర్పాటు నిషేధమన్నారు. నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా లో అసభ్యకరం, కించపరచడం లాంటివి నిషేధమన్నారు.అబ్జర్వర్ ఇందిర మాట్లాడుతూ ఖర్చులనేది పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ప్రధాన పాత్ర ఉంటుందన్నారు.పోటీ చేసిన వారంతా 40 రోజుల్లో లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ దయానందం,ఎంపీడీవో శేషుకుమార్,సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతికుమార్ పాల్గొన్నారు.






