- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష
రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కి ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ ఘటన అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, అనంతగిరి : రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కి ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ ఘటన అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో అనంతగిరి మండలం పాలవరం తండా వద్ద స్కూల్ బస్సు ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పాలవరం తండాకు చెందిన ద్విచక్ర వాహనదారుడు భూక్య కోటేశ్వరరావు మరణించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించారు. కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం సాక్షాదారాలను పరిశీలించి నిర్లక్ష్యంగా బస్సు నడిపిన కోదాడ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ హుస్సేన్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.
Next Story






