ఈనెల 20న గవర్నర్ చేతుల మీదుగా నవోదయ కి శంకుస్థాపన

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-17 16:39:11  IST  )

సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించనున్న నూతన నవోదయ విద్యాలయ భవనానికి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ఈనెల 20న గవర్నర్ చేతుల మీదుగా నవోదయ కి  శంకుస్థాపన
X

దిశ‌, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించనున్న నూతన నవోదయ విద్యాలయ భవనానికి రాజ‌కీయంగా, ప‌రిపాల‌నప‌రంగా కీల‌కంగా మారింది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం శంకుస్థాపన ప్రదేశాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ పడేలా ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను హెచ్చరించారు. శంకుస్థాపన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అప్రోచ్ రోడ్లు తక్షణమే పూర్తి చేయాలి, శిలాఫలకం సిద్ధం చేసి సమయానికి అమర్చాలి, గవర్నర్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా స్టేజ్, శామియానాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణాన్ని పూర్తిగా చదును చేసి, దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రేలు నిరంతరం కొనసాగించాలని సూచించారు.నవోదయ పాఠశాల భవనం నిర్మాణం ద్వారా ప్రభుత్వం విద్యపై పెట్టిన దృష్టికి ఇది నిదర్శనం అని అధికారులు వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. స్థ‌లాన్ని ప‌రిశీలించిన ఆర్‌డీఓ సూర్యనారాయణ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఏ పీడీ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎస్‌వో మోహన్ బాబు, తహసీల్దార్ వాజీద్ అలీ, ఎంఈఓ సలీం షరీఫ్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story