పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందేలా అధికారులు పని చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందేలా అధికారులు పని చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ ల దరఖాస్తులు 30 శాతం దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు. ఇందుకు ఎంఈఓ లు అంకితభావంతో పనిచేయాల్సిందిగా కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కులం ధ్రువపత్రం విషయంలో తహసిల్దార్లు జాప్యం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. బ్యాంక్ అధికారులు బ్యాంక్ అకౌంట్ ప్రారంభించే విషయంలో పూర్తి సహకారం అందించాలని, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ లను గ్రీన్ ఛానల్ ద్వారా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్.డీ.ఎం శ్రామిక్ ను ఆదేశించారు. ప్రత్యేకించి స్కాలర్షిప్ల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ గ్రూపులో సమస్యలను పోస్ట్ చేయాలని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎంతోమంది పేదవారు, కుటుంబం లో తల్లి, తండ్రి లేని వారు స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు మానవతా దృక్పథంతో ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ వచ్చేలా పనిచేయాలని ఆమె కోరారు. రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఈఓ బిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ, ఎల్డీఎం శ్రామిక్, ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు.

Next Story