పోటెత్తిన నామినేషన్లు.. చివరి ఒక్కరోజే 95 నామినేషన్లు దాఖలు

by I. Sairam |

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హాలియా మున్సిపాలిటీ లోని 12 వార్డులకు గాను 135 నామినేషన్లు వచ్చాయి.

పోటెత్తిన నామినేషన్లు.. చివరి ఒక్కరోజే 95 నామినేషన్లు దాఖలు
X

దిశ, హాలియా: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హాలియా మున్సిపాలిటీ లోని 12 వార్డులకు గాను 135 నామినేషన్లు వచ్చాయి. బుధవారం 40 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు గురువారం 95 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. ఇందులో ఒకటో వార్డుకు 12, రెండో వార్డుకు 13, మూడో వార్డుకు 11, 4వ వార్డుకు 14, ఐదవ వార్డుకు 15, ఆరో వార్డుకు 11, ఏడో వార్డుకు 16, 8 వ వార్డుకు 09, 9 వ వార్డుకు 13, పదో వార్డుకు 05, 11వ వార్డుకు 06, 12వ వార్డుకు 10 నామినేషన్లు చొప్పున దాఖలు అయ్యాయి. పార్టీల వారీగా కాంగ్రెస్ పార్టీ 61, బిఆర్ఎస్ 40 బిజెపి 11, ఇండిపెండెంట్లు 19 బీఎస్పీ 04 నామినేషన్లు దాఖలు చేశారు.

Next Story