ఓవైపు ఇంటి పెద్ద మ‌ర‌ణం.. మ‌రోవైపు స‌ర్పంచ్ గా నామినేష‌న్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, తుంగతుర్తి : ఇంటి పెద్ద అనారోగ్యంతో చనిపోయిన దుఃఖంలో కూడా సర్పంచ్ పదవి పోటీకి నామినేషన్ వేసిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మానాపురంలో శనివారం చోటు చేసుకుంది.

ఓవైపు ఇంటి పెద్ద మ‌ర‌ణం.. మ‌రోవైపు స‌ర్పంచ్ గా నామినేష‌న్..!
X

దిశ, తుంగతుర్తి : ఇంటి పెద్ద అనారోగ్యంతో చనిపోయిన దుఃఖంలో కూడా సర్పంచ్ పదవి పోటీకి నామినేషన్ వేసిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మానాపురంలో శనివారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. గ్రామంలోని బానోతు రాంకోటి తన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని సర్పంచ్ గా చూడాలనే ఆశ ఉంది. కాలం గడుస్తూనే ఉంది..ఆ ఎన్నికలు జరిగి పోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప‌లుమార్లు పోటీ చేయడానికి సిద్ధమైన రాంకోటికి దగ్గరి వ్యక్తుల నుంచి వివిధ రకాల ఒత్తిడి, అభ్యర్థనలు వస్తుండడంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గడం పరిపాటిగా మారుతోంది. అయితే ఈసారి ఎవరెన్ని చెప్పినా వినేది లేదంటూ సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించుకొని వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ విధి వక్రీకరించే ప్రయత్నం చేసింది. త‌న ఇంటికి పెద్ద అయిన తండ్రి బానోతు బాల్య అనారోగ్యంతో సరిగ్గా వారం రోజుల క్రితమే చనిపోయాడు. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. కుటుంబమంతా విషాదంలో ఉన్న సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మానాపురం గ్రామం రిజర్వేషన్లలో భాగంగా ఎస్టి మహిళకు దక్కింది. ఓవైపు బాధ ఉన్నప్పటికీ మరోవైపు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దనే ఉద్దేశంతో చివరికి తన భార్య నాగమ్మతో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయించారు. ఈ సంఘటన అందరిలో చర్చనీయాంశమైంది.

Next Story