- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో రైల్వే లైన్‌తో రైతుల కొత్త కష్టాలు..!
అభివృద్ధి పేరుతో చేపడుతున్న రెండో రైల్వే లైన్ పనులు మఠంపల్లి మండల రైతులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, మఠంపల్లి: అభివృద్ధి పేరుతో చేపడుతున్న రెండో రైల్వే లైన్ పనులు మఠంపల్లి మండల రైతులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అండర్‌పాస్‌లలో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర,ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు వ్యవసాయ భూములకు వెళ్లే సంప్రదాయ దారులు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మఠంపల్లి మండల పరిధిలో సుమారు 200 ఎకరాలకు పైగా సాగు భూములు కలిగిన రైతులు ప్రస్తుతం రాకపోకల సమస్యతో సతమతమవుతున్నారు. తరతరాలుగా వినియోగిస్తున్న వ్యవసాయ దారులు రెండో రైల్వే లైన్ నిర్మాణంతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొనడంతో, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పంటల రవాణా ఎలా నిర్వహించాలన్న ప్రశ్న రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే నిర్మించిన రైల్వే అండర్‌పాస్‌లలో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలు పలుమార్లు నిలిచిపోయాయి.
మరోవైపు రెండో రైల్వే లైన్ కారణంగా...
విద్యార్థులు, రైతులు,అత్యవసర సేవలు సైతం తీవ్ర,ఇబ్బందులు, ఎదుర్కొన్నప్పటికీ,సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా, వార్తల ద్వారా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించిన రైల్వే అధికారులకు రైతులు తమ గోడును వివరించినప్పటికీ, గత అనుభవాల దృష్ట్యా ఈసారి కూడా హామీలు కాగితాలకే పరిమితమవుతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వస్తారు.. పరిశీలిస్తారు.. హామీలు ఇస్తారు.. కానీ సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోతాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అండర్‌పాస్‌లు వర్షాకాలంలో చెరువులను తలపిస్తుంటే, మరోవైపు రెండో రైల్వే లైన్ కారణంగా పొలాలకు దారులు మూసుకుపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రైల్వే విస్తరణ ప్రజలకు మేలు చేయాల్సి ఉండగా, గ్రామీణ జీవన విధానానికే ఆటంకంగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాలకు ప్రత్యామ్నాయ మార్గాలు, అదనపు అండర్‌పాస్‌లు, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో రైతుల ఆందోళనలు మరింత మరి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.






