పాలకవీడులో ఘోర రోడ్డు ప్రమాదం...విద్యుత్ ఉద్యోగి మృతి

by Bhanu |

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందిన ఘటన పాలకవీడు మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

పాలకవీడులో ఘోర రోడ్డు ప్రమాదం...విద్యుత్ ఉద్యోగి మృతి
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందిన ఘటన పాలకవీడు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీనరసయ్య తెలిపిన వివరాలు ప్రకారం... జాన్ పహాడ్ గ్రామానికి చెందిన సైదులు (40) మంగళవారం తన బైక్ పై వెళ్తుండగా బెట్టేగూడెం సమీపంలో గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి కింద పడిపోగా, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అతన్ని అంబులెన్స్ ద్వారా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్ కు తరలించారు. అయితే బుధవారం ఉదయం సైదులు చికిత్స పొందుతూ మరణించాడు. సుమారు 25 ఏళ్లుగా జాన్ పహాడ్ సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్ గా పనిచేస్తున్న సైదులకు భార్య గౌస్య బేగం, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గౌస్య బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీనరసయ్య తెలిపారు.





Next Story