బస్సు ఢీకొని 3 పాడి గేదెలు మృతి ..

by Bhanu |

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వివిఆర్ స్కూల్ ఎదుట మంగళవారం రాత్రి బస్సు ఢీకొనడంతో మూడు పాడి గేదలు మృతి చెందాయి

బస్సు ఢీకొని 3 పాడి గేదెలు మృతి ..
X

దిశ నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వివిఆర్ స్కూల్ ఎదుట మంగళవారం రాత్రి బస్సు ఢీకొనడంతో మూడు పాడి గేదలు మృతి చెందాయి. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం కొత్తగూడెం నుండి బెంగళూరు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ చెందిన బస్సు ఢీకొనడంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్య గూడెం గ్రామానికి చెందిన మన్నెం వెంకన్న పాడి గేదలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిలో సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




Next Story