డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

by Bhanu |

ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా, పరిష్కార మార్గం చూపాలని రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష సమక్షంలో సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి దంతూరి సత్తయ్యతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్
X

దిశ, రామన్నపేట: ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా, పరిష్కార మార్గం చూపాలని రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష సమక్షంలో సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి దంతూరి సత్తయ్యతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్జీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు, న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులకి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, రామన్నపేట, వలిగొండ, ఎస్ఐలు డి.నాగరాజు, యుగేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story