- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్మోహిని అలంకార సేవలో నారసింహుడు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామి వారిని జగన్మోహిని అలంకార శేవలో అలంకరించి ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందము, పారాయణీకులు అత్యంత వైభవముగా ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఈ వేడుకలలో ఆలయ ఆనువంశిక ధర్మకర్త శ్రీ బి. నరసింహ మూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు, ఉప సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
జగద్రక్షణ తత్పరతలో భగవానుని అవతార లీలా విశేషాలు అద్భుతమై ఉన్నాయి. స్వామి వారు తన జగన్మోహన లీలా విలాసమును తెలియజేస్తూ లోకోత్తరమైన సౌందర్యాన్ని ఆకర్షణ శక్తిని కలిగిన జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యము కలిగించారు. క్షీరసాగర మథనం వేళ, శ్రీహరిజగన్మోహినిగా అవతరించి రాక్షసులను తన మాయామోహ పరవశంలో పడవేస్తూ, దేవతలకు అమృతంను అందించిన తీరు ఎంతో మనోహరమని, జగత్తు అంతా మాయా మోహమని, ఎవరైతే మోహమును త్యజిస్తారో వారికి అమృతత్త్వము లభించునని, శ్రీ స్వామి వారు ముగ్ధ మోహన రూప, లావణ్య, కారుణ్యాది విశేషాలతో జగన్మోహన దివ్య రూపమైన మోహినిగా స్వామి వారు విలక్షణమైన రూపాన్ని దర్శింపజేస్తూ భక్తులను అనుగ్రహించుట ఈ వేడుకలోని ప్రత్యేకత.






