ఇది మందుల షాపా..? డ్రగ్ డెన్..? ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..!

by Bhanu |

ట్యాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తూ నల్లగొండ వన్ టౌన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఇది మందుల షాపా..? డ్రగ్ డెన్..? ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..!
X


ఇది మందుల షాపా..? డ్రగ్ డెన్..? ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..!

దిశ, నల్లగొండ క్రైం: ట్యాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తూ నల్లగొండ వన్ టౌన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి రూ.25వేల విలువైన 2400 స్పాస్మో టాబ్లెట్స్, ఒక బైక్, రూ.22వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, షాప్ లైసెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈనెల 23న ఉదయం 11గంటల సమయంలో మునుగోడు రోడ్ లో నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ రెడ్డి, అతని సిబ్బంది మునుగోడు రోడ్డులో వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బైక్ పై బ్యాగుతో వెళుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతని పేరు నల్లగొండ జిల్లా కేంద్రంలోని అక్క చెల్మకు చెందిన మహ్మద్ ఖాజా వసీముద్దీన్ అలియాస్ వసీం అక్సం చెప్పారు. ఇతడు కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై, ఈజీగా డబ్బు సంపాదించాలని వసీం స్నేహితులైన అక్కచెల్మకు చెందిన కాజా షోయబ్, అమేర్ లు ఈ దందాపై వివరించగా, వారంతా కూడా దీనికి ఒప్పుకున్నారు. నల్లగొండ చుట్టుపక్కల మెడికల్ షాపులలో ఈ టాబ్లెట్స్ అమ్మట్లేదని, పోలీసువారికి ఇక్కడ నిఘా ఉంటుందని, ఆరు నెలల నుంచి పిడుగురాళ్ల లోని ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ దగ్గరికి బైక్ పై వెళ్లి ఒక షీటును రూ.100కు కొనుగోలు చేసి, అవసరం ఉన్నవారికి రూ.180కి విక్రయస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇదే క్రమంలో మహ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్స్ షీట్స్ తీసుకుని, అవసరం ఉన్నవారికి విక్రయించేందుకు వెళుతుండగా, అదే సమయంలో పోలీసుకు పట్టుబడ్డాడు. ఇతడి ద్వారా గురజాలలోనే మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ ను పట్టుకుని, అతని వద్ద నుండి 15 షీట్స్ ట్లాబ్లెట్స్, సెల్ ఫోన్, షాపు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ వసీముద్దీన్, మణిదీప్ ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపించగా, ఖాజా షోయబ్, షేక్ అమేర్ లు పరారీలో ఉన్నారు.

Next Story