ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో ఉంది : అలుగుబెల్లి నర్సిరెడ్డి

by Bhanu |

ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో కోట్టుమిట్టాడుతున్నాయి. సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయని లేకుంటే ప్రభుత్వ పాఠశాల మూతపడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో ఉంది : అలుగుబెల్లి నర్సిరెడ్డి
X

దిశ, నకిరేకల్ టౌన్ : ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో కోట్టుమిట్టాడుతున్నాయి. సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయని లేకుంటే ప్రభుత్వ పాఠశాల మూతపడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణానికి ప్రభుత్వ బడులు నిలబడాలి,చదువుల్లో అంతరాలు పోవాలనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాత చేరుకున్నది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చదువుల్లో మార్పు రావాలి,ఉన్నోడు పిల్లలైనా,లేనివాడి పిల్లలైనా ఒకే బడిలో చదువుకోవాలని లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందని తెలిపారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు పేద వర్గాల పిల్లల కొరకే అన్న చందంగా ఉందన్నారు. చదువుకునే రోజులు పోయి చదువు కొనుక్కునే రోజులు వచ్చాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి అన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల ప్రచారము తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి అన్నారు. కానీ ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాల బలుపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.తెలంగాణలో లేకుంటే నాలుగైదు సంవత్సరాల్లో మెజార్టీ ప్రభుత్వ బడులల్లో విద్యార్థులు చేరక లేక పోతే మూత పడిపోయే అవకాశం ఉన్నదని చెప్పారు.అందుకే తెలంగాణ పౌర స్పందన వేదిక నుండి మేము అంతరాలు లేని చదువులకై అందరూ మాట్లాడాలని కార్యాచరణకు రావాలని మేము ప్రజలకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు టి.నర్సింహమూర్తి, ఆర్.రాకేష్, కుమార్, పి.జయసాగర్, కె.శ్రీనివాస్, కె.రవి కుమార్, ప్రజాసంఘాల నాయకులు ఆర్.వెంకన్న, ఎ.తాజేశ్వర్, టాప్రా నాయకులు సిహెచ్.అంజిరెడ్డి, బి.ప్రకాష్ రావు, ఐద్వా నాయకులు సిహెచ్.నాగమణి, బి.ఇందిర, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్, సిఐటియు నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ నాయకులు వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story