- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిండుకుండలా నాగార్జున సాగర్.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
by Naga Rani Yarlagadda |
ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదనీటితో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) జలాశయం మరోసారి నిండుకుండలా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదనీటితో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,33,824 క్యూసెక్కులు వస్తుండగా.. 1,33,824 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి కాలువకు 9500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 32,480 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. 311.14 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. కాగా.. మరోసారి సాగర్ గేట్లను ఎత్తడంతో ఆ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
Next Story






