- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీకొని వ్యక్తి మృతి
by Bhanu |
నాగారం మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, నాగారం: నాగారం మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, నాగారం బంగ్లా గ్రామానికి చెందిన దోమల వెంకన్న అదేరోజు రాత్రి 10.45 సమయంలో తన వ్యవసాయ పనుల కోసం బైక్‌పై నర్సింహులగూడెం వైపుగా వెళ్తున్నాడు. అదే సమయంలో సూర్యాపేట నుండి తిరుమలగిరికి వెళ్తున్న AP09 AQ 0099 నంబర్ గల కారు అతివేగంగా వస్తూ వెంకన్నను బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై వెంకన్న భార్య దోమల ఉమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నాగారం ఎస్సై ఎం. ఐలయ్య దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Next Story






