గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Bhanu |

నాగారం మండలం విజయనగరం కాలని వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పసునూరు గ్రామానికి చెందిన కడారి శ్రీను(45)తలకు బలమైన గాయం అవగా అక్కడిక్కడే మృతిచెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, నాగారం: నాగారం మండలం విజయనగరం కాలని వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పసునూరు గ్రామానికి చెందిన కడారి శ్రీను(45)తలకు బలమైన గాయం అవగా అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తమ బంధువు అయిన డి.కొత్తపెల్లి గ్రామానికి చెందిన బీసు నరసయ్య ఇంటివద్ద గంగదేవమ్మ పండుగ ఉండగా హాజరు అయి తిరిగి తను ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్ కి వెళ్ళడానికి నాగారం బంగ్లా వరకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. దీంతో నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. మృతిని పెద్ద కుమారుడు కడారి సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇట్టి ప్రమాదం గురించి ఎవరి వద్ద అయిన సమాచారం ఉంటే సమాచారం అందించాలని ఎస్సై యం.ఐలయ్య తెలిపారు.

Next Story