నల్లగొండ నియోజకవర్గానికే నా జీవితం అంకితం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Ratna Kumari |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : "నా జీవితం ఎప్పుడూ నల్గొండ నియోజకవర్గానికే అంకితం" అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్లగొండ నియోజకవర్గానికే నా జీవితం అంకితం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : "నా జీవితం ఎప్పుడూ నల్గొండ నియోజకవర్గానికే అంకితం" అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో (ఇందిరా భవన్ లో) నల్లగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని, తాను కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. గత పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేదని అన్నారుఅన్నారు. మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందజేసిందన్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా తాను అండగా ఉంటానని, సహాయం చేస్తానని చెప్పారు. గ్రామాలలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తానని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో 1000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఎక్కడలేని విధంగా నల్లగొండలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రూ. 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికై రసూల్ పురం, ఖుదావాన్ పురం గ్రామాల సర్పంచ్ లను ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, జూలకంటి వెంకట్ రెడ్డి, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story