నా భర్త కనిపించడం లేదు సారూ..

by Naveena |
నా భర్త కనిపించడం లేదు సారూ..
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన బుర్రి వినయ్ (23) కనిపించడం లేదని భార్య బుర్రి టీనా రాణి ఫిర్యాదు చేసినట్లు ఎస్ ఐ లక్ష్మయ్య గురువారం తెలిపారు. ఈ నెల 9న క్రిష్ణా పురంలోని ఇంటి నుంచి తమ స్వంత గ్రామమైన దామరచర్ల మండలం తెట్టేకుంట వెళ్లి.. వస్తానని చెప్పి వెళ్ళాడు. ఫోన్ కూడా స్వీచాఫ్ ఉండటంతో అనుమానం వచ్చి..బంధువుల ఇళ్లలో చుట్టూ పక్కల వెతికిన ఆచూకీ తెలియలేదు. దీంతో గురువారం ఫిర్యాధు చేయడంతో విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .ఆచూకీ తెలిసిన వారు ఎస్ ఐ 8712670189 , సిఐ 87126715151 నెంబర్లు సమాచారం ఇవ్వాలని కోరారు.



Next Story

Most Viewed